calender_icon.png 28 December, 2024 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌశిక్‌రెడ్డిపై దాడి వెనుక రేవంత్ హస్తం

16-09-2024 01:03:47 AM

బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి వెనుక సీఎం రేవంత్‌రెడ్డి హస్తం ఉందని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్‌ను రేవం త్ రెడ్డి డ్యామేజ్ చేస్తున్నారన్నారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే తొక్కి పడేస్తాం అంటూ సీఎం కామెంట్స్ చేయడంపై మండిపడ్డారు. బీఆర్‌ఎ కార్యకర్తలకు  ఎలాంటి హాని జరిగినా.. కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్, రాంబాబు పాల్గొన్నారు.