బీజేఎల్పీ నేత ఏలేటి
హైదరాబా ద్, అక్టోబర్ 20 (విజయక్రాం తి): ప్రజలకు ఇచ్చిన హామీ లు నెరవేర్చకుం డా ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని.. అందుకే కాంగ్రెస్ ప్రజా వంచన ఉత్సవాలు చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసమర్థుడు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుందనడానికి రేవంత్‌ను ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అని.. ఇప్పుడు పదవిని కాపాడుకోవడానికి ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానంటూ దిగజారి పోయాడన్నారు.