మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, నవంబర్ 21: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భయమని, దీంతోనే మానుకోటలో కేటీఆర్ ధర్నాకు అనుమతి ఇవ్వలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రం లో గురువారం మాజీ ఎంపీ మాలోతు కవితతో కలిసి నిర్వహించిన మీడియా సమావే శంలో ఆమె మాట్లాడారు. పోలీసులను అ డ్డం పెట్టుకొని సీఎం ధర్నాకు అనుమతులు రాకుండా చేశారని అన్నారు.
సీఎం సంవత్సరం నుంచి సీఎం నిత్యం ఏదో ఒక విషయంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే సీఎంకు భయం వణుకు ఉందనే విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని స్పష్టం చేశారు. సీఎం తన శక్తినంతా ఉపయోగించి కేటీఆర్ రాకను అడ్డుకున్నారన్నారు. త్వరలో అన్ని అనుమతులు సాధిం చి, తాము శాంతియుతంగా ధర్నా చేపట్టి తీరుతామన్నారు. సీఎం మరో నాలుగు సంవత్సరాలు మాత్రమే సీఎంగా ఉంటారని, తర్వాత పరిణామాలను గుర్తుంచుకో వాలని హెచ్చరించారు. సమావేశంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.