21-02-2025 01:11:55 AM
ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర ఏమీ లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ కూడా చేసిందేమీ లేదని, సుప్రీం కోర్టు తీర్పు వల్లే వర్గీకరణకు బాటలు పడ్డాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
గురు వారం తన నివాసంలో దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు మహేశ్ కోగిల ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడా రు. దళితుల్లో ఎవరికీ అన్యాయం జరగకుం డా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూ చించారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి, వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారని, ఈ వంకతో ఉద్యోగ క్యాలెండర్ అమలును నిలిపే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
దళిత కుటుంబాలకు రూ.10 లక్షలకు బదులు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళితబంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు బడ్జెట్‌లో రూ.33 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.9800 కోట్లే ఖర్చు చేశారని మండిపడ్డారు.