కాంగ్రెస్ నేత వీహెచ్
హైదరాబాద్, జూలై 20(విజయక్రాంతి): రైతు రుణమాఫీ చేసి సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో మంచి పేరు తెచ్చుకున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంత్‌రావు అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను, హామీలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ కొద్దిలో మిస్ అయ్యిందన్నారు. తాము కేంద్రంలో అధికా రంలోకి వస్తే కులగణన చేపడతామని వీహెచ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో బిల్లు పెట్టించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓటు వేశారని తెలిపారు.
అందుకే తాము అధికారంలోకి వచ్చామన్నారు. రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారని, అందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడాకా రులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిం చాలని కోరారు. అన్ని జిల్లా కేంద్రా లు, పట్టణాల్లో క్రీడా మైదానాల కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయనున్నట్లు వీహెచ్ తెలిపారు.