- కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలి
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచనాల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆమె మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేద న్నారు.
రాజకీయాల్లో జైలు జీవితం చిన్న పాస్ మాత్రమేనని పేర్కొన్నా రు. సీఎం రేవంత్ ఇష్టానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రజా వ్యతిరేక తప్పదని హెచ్చరించా రు. లగచర్ల భూసేకరణ రద్దు బీఆర్‌ఎస్ విజయమేనని చెప్పారు. వసతి గృహాల్లో బాలికలు ఫుడ్ పాయిజన్ తో చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదని ఆరోపించారు.
తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారం చేసి న ఘనత కేసీఆర్‌కు దక్కుతుంద ని, తెలంగాణ చరిత్రలో ఆయన సంత కం చెరగని ముద్ర అన్నారు. నవంబర్ 29న దీక్ష చేపట్టి ఆనాటి కేంద్రం మెడలు వచ్చి రాష్ట్రం ప్రకటించేలా అలుపెరగని ఉద్యమం చేశారని గుర్తు చేశారు.