calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాపై రేవంత్ కుట్రలు

28-10-2024 02:17:42 AM

  1. రాజకీయంంగా ఎదుర్కొనలేక తెరవెనుక కుట్రలు
  2. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది
  3. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రం డ్రగ్స్ కేసుగా మారింది
  4. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాం తి): రాజకీయంగా ఎదురుకునే దమ్ము, ధైర్యం లేక సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ధ్వజమెత్తారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ మానసికంగా ఇ బ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు.

ఆదివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో జన్వాడ ఫామ్‌హౌ స్ అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రా ణాలు పణంగా పెట్టి పోరాటం చేసి తెలంగా ణ తెచ్చినోళ్లమని, రేవంత్ తాటాకు చప్పుళ్ల కు బెదిరేదిలేదని స్పష్టంచేశారు. కేసులు,  కుట్రలు తమకు కొత్తమే కాదని, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకి తెగించి వచ్చామన్నారు.

కేసీఆర్ నేర్పిన ఉద్యమ బా టలో బీఆర్‌ఎస్ నేతలు నడుస్తూ ప్రభుత్వం పై రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపా రు. 11నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొం గులేటి బాంబులు పేల్చడమంటే ఏదో చేస్తాడని అనుకుంటే చివరకు కొండను తొవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని ఎద్దే వా చేశారు.

మూసీ సుందరీకరణ, ఆరు గ్యా రెంటీలు, ఉద్యోగాలు వంటి అంశాలపై ప్ర భుత్వాన్ని నిలదీస్తుండటంతో వాటికి సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు అడ్డదారుల్లో పరుగులు పెడుతున్నారని మండిపడ్డారు. జన్వాడ రిజర్వ్ కాలనీ ఫామ్‌హౌస్‌లో ఫ్యామిలీ పార్టీ జరిగిందని, రాజ్ పాకాల గృహప్రవేశం చేసినందుకు కుటుంబ సభ్యులు విందు ఏర్పాటు చేశారని తెలిపా రు.

విందులో మద్యం సేవించిన మాట వా స్తవమని, అక్కడున్నవారంతా తనకు టుంబ సభ్యులు, బంధుమిత్రులు, పిల్లలేనని చెప్పా రు. దీనికి రాజకీయాలు అట్టగట్టడం సరికాదన్నారు. డ్రగ్స్ అనవాళ్లు దొరకలేదని స్వ యంగా అబ్కారీ అధికారులు చెప్పినా కేసు లు చేస్తామనడం తెలివి తక్కువతనమని వి మర్శించారు.

స్నిఫర్ డాగ్స్ తీసుకొచ్చి సోదా లు చేసినా ఎటువంటి డ్రగ్స్ కనిపించలేదని, అసలు హోస్టింగ్ లేకపోతే, కోహోస్టింగ్ ఎ క్కడిదని ప్రశ్నించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చి న వ్యక్తి ఎక్క డ డ్రగ్స్ తీసుకున్నాడో కనుక్కోవాలని సూచించారు. ఇలాంటి కేసులకు భ యపడే ప్రసక్తిలేదని, దాదాపు 22 గంటల పాటు సోదాలు చేశారని ఆరోపించారు.

తన బావమరిది రాజ్ పాకాల సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భం గా దావత్ చేసుకోవడం తప్పా? అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆయనకు చేతనైతే తనతో తల పడాలని, ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి ప్రజా పాలన అందించాలని సవాల్ చేశారు.