28-02-2025 01:07:29 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి కార్మి కులను రక్షించాల్సింది పోయి, చేసిన తప్పులను ఇతరులపై నెట్టే ప్రయ త్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జీఎస్‌ఐ, ఇంజినీరింగ్ నిపుణులతో సంప్రదించకుండానే, అవినీతి సొ మ్ముకు ఆశపడి ఆగిపోయిన ప్రాజెక్ట్‌ని ముందస్తు జాగ్రత్తలు తీసు కోకుండా ప్రారంభించారని ఆరోపించారు.
ఢిల్లీలో బుధవారం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గురు వారం స్పందించారు. రేవంత్‌రెడ్డి ధన దాహంతో 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని, వారు బతికున్నారో లేదోనన్న ఆందోళనకర పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అసమర్థ పాల నా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ విమర్శ లు చేస్తున్నారన్నారు.
చీఫ్ మినిస్టర్‌గా మాట్లాడాల్సింది పోయి చీప్ మినిస్టర్‌గా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో తామే ఉన్నామన్న విషయాన్ని రేవంత్‌రెడ్డి మరిచిపోయారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కావాల్సిన విచారణలు, దర్యాప్తులు చేసుకోవచ్చన్నారు. అరచేతిలో స్వ ర్గం చూపించేలా ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకే ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.