calender_icon.png 1 February, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా దీవెనతోనే రేవంత్ సీఎం

01-02-2025 02:02:25 AM

* పంచభూతాలను పూజించే సంస్కృతి ఆదివాసీలది

*  ప్రజాదర్బార్‌లో మంత్రి సీతక్క

ఆదిలాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): పంచభూతాలను పూజించే సం  ఆదివాసీలది అని, పంచభూతాల్లో మిళితమైన జంతువులను పూజిస్తారని ఉ  ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. గతంలో నాగోబాను సీఎం రేవంత్‌రెడ్డి దరించుకున్నారని, ఆనాడు నాగోబా దీవెనలు, మెస్రం వంశస్తుల ఆశీరాదంతో సీఎం అయ్యారని అన్నారు.

ఇం  మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం నిరహించిన ప్రజాదర్బార్‌లో ఆమె పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మంత్రి సీతక్క ఆదివాసీ సాంప్రదాయ వస్త్రధారణలో నాగోబాను దరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దర్బార్‌లో పాల్గొని మంత్రి మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవితాలు అడవితో, ప్రకృతితో, పంచభూ  ముడి  ఉన్నాయని అన్నారు. వీటిని ఎప్పుడూ విస్మరించకూడదని చెప్పారు. 

సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్ 

అనంతరం కలెక్టర్ రాజరిషా మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నాగోబా దర్బార్‌లో అర్జీదారులు తమ సమస్యలపై దరఖాస్తులను సమర్పించుటకు ఆన్ని శాఖలకు సంబంధించిన కౌంటర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతంలో సీకరించిన అర్జీల్లోని సమస్యలను ఐటీడీఏ పీవోతో కలసి పరిష్కరించామని చెప్పారు. ఐటీడీఏ దారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఆన్ని ఆశ్రమ పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర ఏర్పాటు చేశామని తెలిపారు. 

వారు వచ్చారు.. వీరు వెళ్లారు

నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీల సమస్యల పరిష్కారానికై నిరహించిన దర్బార్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనబడింది. అధికారికంగా నిరహించిన దర్బార్ సమావేశానికి ప్రజాప్రతి  రావడంతో అధికారులు ఒక్కసారిగా సభ వేదిక దిగి వెళ్లిపోయారు. ఇలా రెండుసార్లు జరగడం వింతగొల్పింది.

దర్బార్‌లో కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆదివాసీలకు చెందిన తొమ్మిది తెగల ప్రతినిధులు తమతమ సమస్యలను అధికారుల దృష్టికి తీసు  వస్తున్న క్రమంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ నాయకులతో కలిసి వచ్చారు. వారిని చూసిన అధికారులు దర్బార్ వేదిక దిగి వెళ్లిపోయారు.

దీంతో కొద్దిసేపు సభా వేదికపై కుర్చీలు ఖాళీగా దరనమిచ్చాయి. ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత అధికారులు తిరిగి వచ్చారు. సమావేశం కొనసాగుతుండగా  మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్ దర్బార్ వైపు రావడంతో అధికారులు వేదిక దిగి మళ్లీ గదిలోకి వెళ్లిపోయారు. ప్రజా ప్రతినిధులు సభా వేదికపై ఉన్నంతసేపు సుమారు రెండు గంటల పాటు కలెక్టర్, ఎస్పీ తో పాటు ఇతర అధికారులు గదిలోనే కూర్చుండి పోయారు.