23-02-2025 12:52:14 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాం తి): రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ను ప్రజలంతా ఆర్‌ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నారని, అసలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఎం దుకు కాపాడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి, బీజేపీలో చేరుతానని ఏమైనా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులైన అమృత్ టెండర్లలో రేవంత్‌రెడ్డి బావమరిది స్కాం చేసినా కేంద్రం ఎందుకు కాపాడుతోందని, రేవంత్ మంత్రివర్గంలోని పొంగులేటిపై ఈడీ దాడిచేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బీజేపీ చెప్పాలన్నారు. సుంకిశాల ప్రమాదంలో కూడా రేవంత్‌రెడ్డి ఎవరిని కాపాడుతున్నా డో తెలుసన్నారు.
తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కేటీఆర్ మాట్లాడారు.. తెలంగాణను క్యాన్సర్ వ్యాధితో పోల్చిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. రాష్ర్టం దివాళా తీసిందని రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, ఆయనంత దివాళాకోరు సీఎం ఈ దేశంలో ఎవరూ లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అప్పులపై రేవంత్‌రెడ్డి చెప్తున్నవి అబద్ధాలేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫిబ్రవరి 17న విడుదల చేసిన సమగ్ర నివేదిక స్పష్టం చేస్తోందన్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వమే స్టేట్ స్టాటిస్టికల్ అట్లాస్ నివేదికలో ఒప్పుకుందని వివరించారు. రాష్ర్ట ప్రభుత్వం సాధికారికంగా విడుదల చేసిన నివేదిక అది... రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధాలను తిప్పికొడుతూ, సమగ్రమైన నివేదిక ఇచ్చినందుకు భట్టివిక్రమార్కకు ధన్యవాదా లు తెలిపారు. కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని తెలుసుకుని వెబ్‌సైట్ నుంచి రిపోర్టును డిలీట్ చేసింది ఈ ప్రభుత్వమేనన్నారు.
తలసరి ఆదాయంలో 2014 సంవత్సరంలో తెలంగాణ భారతదేశంలో 10వ స్థానంలో ఉందని, 2023 నాటికి తలసరి ఆదాయం లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ ఉందని ఈ నివేదిక చెబుతోందన్నారు. 2013 దేశ జీడీపీలో తెలంగాణ వాటా నాలుగు శాతంగా ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి అది పెరిగి 5.1 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసిందని వెల్లడించారు.
కృష్ణా జలాల దోపిడీపై అసెంబ్లీలో ఎండగడతాం..
కాళేశ్వరం, మిషన్ కాకతీయలాంటి సాగునీటి పథకాలతో పాటు రైతుబంధులాంటి సంక్షేమ పథకాలతోనే తెలంగాణ సంపద పెరిగిందని ఈ నివేదిక చెబుతోందన్నారు. కృష్ణాజలాల దోపిడీపై రాష్ర్ట ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతామన్నారు. తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ అద్భుతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికే స్పష్టం చేసిందన్నారు. టకీ టకీమని రైతుల ఖాతా ల్లో రైతు భరోసా డబ్బులు అయితే పడడం లేదు కానీ, టకీ టకీమని రాహుల్‌గాంధీ ఖాతాలో పడుతున్నాయో లేదో చూడాలన్నారు.
2014లో తెలంగాణ ఆదాయంలో వడ్డీల శాతం 21.64గా ఉంటే..2023నాటికి తెలంగాణ ఆదాయంలో వడ్డీల శాతం కేవ లం 17.19 ఉందన్నారు. వీలుంటే అసెంబ్లీ లో రేవంత్‌రెడ్డి తన పాలనపె చర్చ పెట్టాలని, సరిపడ సమయం ఇస్తే అసెంబ్లీలోని రేవంత్ రెడ్డి దుమ్ముదులుపుతామని, ఈ సవాల్‌ను రేవంత్‌రెడ్డికి దమ్ముంటే స్వీకరించాలన్నారు. ఆరు గ్యారెంటీలు అమలుచేసిన దగ్గరే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎంకు కేటీఆర్ కౌంటరిచ్చారు.
కృష్ణాజలాలపై కేవలం ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రేవంత్ తిక్కనిర్ణయాలు, హైడ్రాలాంటి దిక్కుమాలిన విధానాలతో మాత్రమే రాష్ర్ట ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. రేవంత్‌రెడ్డి ఆస్తులు ఆదా యం పెరుగుతుంది కాని రాష్ర్టం ఆస్తులు ఆదాయం పడిపోతుందని ఆరోపించారు. రాష్ర్టంలో కొత్త నిర్మాణాలపై ఒక్క స్క్వేర్ ఫీట్‌కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
మనమే ఎక్కువ ఇస్తున్నాం..
మనకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనమే ఈ దేశానికి రెట్టింపు ఆదాయాన్ని ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవ త్సరాల కాలంలో స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూలో దేశంలోనే 88 శాతం సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా తెలంగాణ అగ్రభాగాన నిలబడిందన్నారు.
ఈ నివేదిక ప్రకారం జీఎస్‌డీపీలో తెలంగాణ స్థానం 2014లో ఐదు లక్షల కోట్లని, కానీ మొన్న భట్టివిక్రమార్క విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ రాష్ర్ట జీఎస్‌డీపీ కేసీఆర్ హయాంలో ఐదు లక్షల కోట్లనుంచి 15 లక్షల కోట్లకు పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేస్తుందన్నారు.
జీఎస్‌డీపీలోలో తెలంగాణ గుజ రాత్ కంటే మెరుగైన స్థితిలో ఉందని నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రాష్ర్టంలో ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారని, బండి సంజయ్‌కు చేతనైతే ఆర్‌ఆర్ టాక్స్‌పై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.