ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. హియాయత్ నగర్‌లోని కార్యాలయంలో వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై సీఎం రేవంత్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు గురువారం ఆయన నివాసానికి వెళ్తే తమకు సమయమివ్వలే దని వెల్లడించారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని కనీసం ఇంతవరకు సమీక్ష కూడా నిర్వహించని పరిస్థితిలో సీఎం ఉన్నారని మండిపడ్డారు. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన విద్యా ర్థి నాయకులకు ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టించారని, ఇప్పు డు కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. సమావేశంలో నాయకులు ఇటిక్యాల రామకృష్ణ, గ్యార నరేశ్, బానోత్ రఘురాం, కాసో జు నాగజ్యోతి, లెనిన్ పాల్గొన్నారు.