calender_icon.png 9 October, 2024 | 8:00 AM

మాదిగలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్

09-10-2024 01:38:09 AM

వర్గీకరణ విషయంలో మాట తప్పి మాలలకు కొమ్ముకాస్తున్నారు 

ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

ముషీరాబాద్, అక్టోబర్ 8: ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ సర్కార్ మాది గలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడా రు. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగా ల భర్తీని వేగవంతం చేశారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్‌ల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టాలని అన్నారు. అదే విధంగా అన్ని కలెక్టరేట్లలో వినతిపత్రాలు అందజేయాలని పేర్కొన్నారు.

హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాలలకు కొమ్ముకాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ ఛీప్‌గా మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి మాలలకు ఎక్కువ సంఖ్యలో ఇచ్చారని అన్నారు.

గడ్డం వివేక్, వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా అదే కుటుంబం నుంచి వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. కడియం శ్రీహరిని తానే ఆహ్వా నించానని రేవంత్ రెడ్డి చెప్పారని, సిట్టింగ్ ఎంపీ అయిన పసునూరి దయాకర్‌కు టికె ట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వర్గీకరణ లేకుండానే ఉపాధ్యాయులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారని అన్నారు.

సీఎం పదవి కోల్పోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే, కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి కోల్పోవాలా అని రేవంత్ రెడ్డి మాదిగ ఎమ్మెల్యేలతో అన్నారని అన్నారు. 

అవసరమైతే త్వరలో ఆ ఎమ్మెల్యేల పేర్లు బయట పెడతానని తెలిపారు. ఈ నెల 15న ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ప్రకటిస్తామని అన్నారు. బీసీ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్‌ను చూసి గర్వపడుతున్నామని, ఆయన బీసీల కోసం మాట్లాడు తున్నారని అన్నారు.

కానీ మంత్రి దామోదర రాజనర్సింహ మాదిగ బిడ్డల ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్ మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శాంసన్ రాజు తదితరులు పాల్గొన్నారు.