calender_icon.png 8 January, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న రేవంత్, బాబు భేటీ

04-07-2024 01:02:06 AM

ప్రజాభవన్‌లో ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల అధికారులు బేగంపేటలోని  ప్రజాభవన్‌ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు ఆయన సూచనలు చేశారు. సమన్వయంతో సమావేశానికి తగు ఏర్పా ట్లు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకటరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.