calender_icon.png 16 November, 2024 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే దీపావళికల్లా బంగారంపై 18% రాబడులు

04-11-2024 12:00:00 AM

అనలిస్టుల అంచనా

న్యూఢిల్లీ, నవంబర్ 3: వచ్చే 2025 దీపావళికల్లా బంగారం పెట్టుబడులు గణనీయం గా 15-18 శాతం మేర రాబడుల్ని ఇస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సానుకూల ఆర్థిక అంశాలు, సురక్షిత మదుపు సాధనంగా బంగారానికి ఉన్న డిమాండ్‌తో సంవత్ 2081లో ఈ విలువైన లోహం అప్‌ట్రెండ్ కొనసాగుతుందని వారన్నారు. హిందూ క్యాలండర్ ప్రకారం ఈ దీపావళికి 2081 కొత్త సంవత్సరం ప్రారంభమయ్యింది.

బంగారం, వెండి సంవత్ 2080లో భారీగా లాభపడ్డాయని, ఈ లాభాలకంటే ప్రస్తుత 2081లో వీటి పెరుగుదల కాస్త తక్కువగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. బంగారం 2023 దీపావళి నుంచి ఈ పండుగ వరకూ 35 శాతం పెరగ్గా, వెండి ధర 40 శాతం ఎగిసిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి 40 శాతం ఎగిసింది. దిగుమతి సుంకాల కోత కొనసాగితే దేశీయంగా బంగారం వచ్చే ఏడాదికాలంలో 15-18 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. అయితే సుంకాల్ని తిరిగి పెంచితే బంగారంపై రాబడులు తగ్గవచ్చని అంచనా వేశారు.