calender_icon.png 12 February, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్రాడి సమస్యలు, సవాళ్ల ఆధారంగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్

12-02-2025 12:52:16 AM

ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో రూపొందిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహార్ జంటగా నటించారు.

ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుదల చేస్తున్నారు. కోస్తాంధ్రలో పూర్వీ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌లో యూత్‌కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు.

ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న ప్రదీప్.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. బాధ్యత్యారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లే ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందింది.