హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(సీపీఆర్‌వో)గా సేవలందించిన మహమ్మద్ ముర్తుజా శనివారం పదవీ విరమణ చేశారు. ఆయనను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అడిషనల్ కమిషనర్ అడ్మిన్ నళిని పద్మావతి సన్మానించారు. ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్‌లో సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. సమాచార పౌరసంబంధాల జేడీ అయిన మహమ్మద్ ముర్తజా అలీ 2021 సెప్టెంబర్ నుంచి సీపీఆర్‌వోగా విధులు నిర్వహించారు. జీహెచ్ ఎంసీలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు కూడా పదవీ విరమణ చెందారు. అలాగే హైదరాబాద్ కలెక్టరేట్ సమాచార శాఖలో పనిచేస్తున్న చెంగల రవికుమార్ శనివారం పదవీ విరమణ పొందారు. ఆయనను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సన్మానించారు.