29-03-2025 12:40:54 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మార్చి 28(విజయక్రాంతి) : ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయ డిప్యూటీ సీఈవో జ్యోతి పదవి విరమణ కార్యక్రమా నికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఈవో జ్యోతి జిల్లాకు అందించిన సేవలను గుర్తు చేశారు. ప్రతీ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, జ్యోతి తో కలిసి తాను గత 8 నెలల నుంచి పనిచేశానని, అయితే తాను ఇక్కడికి వచ్చిన కొత్తలో డి ఆర్ డి ఏ, డిపిఓ, జెడ్పి సీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆయా ఇన్చార్జి బాధ్యతలను జ్యోతి సమర్థవంతంగా నిర్వహించిందని కలెక్టర్ కొనియాడారు. స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఆమె ఎంతో నిబద్ధతతో పని చేసిందన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలని సూచించారు. .
ఈ పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాలలో తాము విద్యాభ్యాసం చేసే బాల్య దశలో జ్యోతి తో ఉన్న సన్నిహితాన్ని గుర్తు చేశారు. నారాయణపేటను ఎంచుకొని ఇక్కడికి వచ్చిందన్నారు. అంతకు ముందు పలువురు జిల్లా అధికారులు, ఎంపిడివోలు, ఎంపివోలు, పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో డిప్యూటీ సీఈవో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ఆమె చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని వారంతా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి , డిఆర్డిఓ మొగులప్ప, సిపిఓ యోగానంద్, డి ఎ వో జాన్ సుధాకర్, పి ఆర్ ఈ ఈ హీర్యా నాయక్, డీ ఈ ఓ గోవిందరాజులు, డి ఎల్ పి ఓ సుధాకర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈ ఈ రంగారావు, డి పి ఆర్ ఓ ఎం .ఏ. రషీద్, బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్ ఖలీల్, సాంఘిక సంక్షేమ అధికారి ఉమా పతి, ఎంపీడీవోలు, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు