calender_icon.png 3 April, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజం

02-04-2025 07:22:17 PM

డిడి రమాదేవి.. 

కాగజ్ నగర్ (విజయక్రాంతి): వృత్తిని నిబద్ధతతో నిర్వహించి సామాజిక బాధ్యతను నెరవేర్చిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ పొందాల్సిందే అని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. కాగజ్ నగర్ మండలం రేగుల గూడా గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శంకర్ కు ఆత్మీయ వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా డిడి మాట్లాడుతూ... పదవి విరమణ పొందిన అనంతరం ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసిఎంఓ ఉద్ధవ్, టి డబ్ల్యూ టి యు జిల్లా అధ్యక్షుడు రవీందర్, కమ్మర్ హుస్సేన్, జంగు, కృష్ణారావు, గోపాల్, మాధవ్, అనంతి, సోమయ్య, వెంకటేశ్వర్లు, యాదవరావు, శంకర్, అభినవ్, ప్రీతి, తుకారాం తదితరులు పాల్గొన్నారు.