28-02-2025 10:46:18 PM
స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగరీత్యా పదవీ విరమణ సహజమని స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి అన్నారు. ఈ మేరకు శుక్రవారం అల్వాల్ సర్కిల్ -27 మున్సిపల్ కార్మికులు పోచయ్య, ఆగమ్మ, బాలమణిల పదవీ విరమణ అభినందన సభ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ... స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ విభాగంలో పనిచేసి ప్రజల మన్ననలు పొందిన స్వచ్ఛ కార్మికులు అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ 27 జోనల్ కమిషనర్ తో పాటు కే. రాజ్ కుమార్, బి. నర్సింగ్ రావు, దుర్గయ్య, మహేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.