calender_icon.png 1 March, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి

01-03-2025 07:20:38 PM

నందులాల్ సేవలు మరువలేనివి..

సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ సుజీత్ కుమార్..

కామారెడ్డి (విజయక్రాంతి): పోస్ట్ మాస్టర్ నందులాల్ సేవలు మరువలేనివని కామారెడ్డి పోస్టల్ డిపార్ట్మెంట్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ అధికారి సుజీత్ కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోస్టల్ ఉద్యోగి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని అన్నారు. కామారెడ్డి పట్టణ పోస్ట్ మాస్టర్ గా పనిచేసిన నందులాల్ విది నిర్వహణలో బాధ్యతగా పని చేస్తూ ప్రతి ఉద్యోగికి మనసు నొప్పివ్వకుండ ఉండేవాడాన్నారు. సమయ పాలనలో ముందుండే వాడని ఉదయం 8 గంటలకు కార్యాలయానికి వచ్చి సాయంత్రం 8, 9 గంటలకు అతని పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెల్లె వాడని ఆయన సేవలను కొనియాడారు.

ప్రతి ఉద్యోగి అతనిని అదర్శంగ తీసుకోవాలన్నారు. 31 సంవత్సరాలు సుదీర్ఘకాలం పోస్టల్ డిపార్ట్ మెంట్ వివిధ హోదాల్లో విధులు నిర్వహించి సేవలందించిన నందులాల్ ను ఆయన అభినందించారు. విదినిర్వంలో నందులాల్ కు సహకరించిన అతని బాగస్వామి సరళకు అతనికి శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది పోస్ట్ మాస్టర్ దేవిసింగ్, ఎస్పియంలు రాజేందర్ రెడ్డి, ఉపేందర్, డివోవిఎ సురేష్, రాజు, ట్రెజరర్ రాజేందర్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్లు బలరాజ్ గౌడ్, జీలాని, అతని కుటుంబ సబ్యులు సెంట్రల్ ఎక్సైజ్ రిటైర్డ్, సిఐ ఏ రాజన్న, రిటైర్డ్ అసిస్టెంట్ ఆడిట్ అధికారి శారద, రిటైర్డ్ ఏచ్ఏం రాజయ్య, రిటైర్డ్ వ్యవసాయ అధికారి శకుంతల, రిటైర్డ్ రైల్వే టీఎక్సఆర్ రామచందర్, పోస్టల్ ఉద్యోగి సూర్యనారాయణ, కుటుంబ సభ్యులు, బందు మిత్రులు పాల్గొన్నారు.