28-02-2025 06:15:28 PM
మందమర్రి (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో విధులు నిర్వహించే విధులు నిర్వహించే కార్మికులకు పదవి విరమణ తప్పనిసరి అని పదవి విరమణ పొందే కార్మికులు భావి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ ఆకాంక్షించారు. శుక్రవారం ఏరియాలోని ఇల్లందు క్లబ్ లో నిర్వహించిన జిఎం కార్యాలయం అసిస్టెంట్ సూపర్డెంట్ అధికారిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ముప్పిరి మధుసూదన్ రావు సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సింగరేణిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవి విరమణ పొందడం బాధాకరమైనప్పటికీ వయోభారం రిత్యా ప్రతి వ్యక్తికి పదవి విరమణ తప్పనిసరని ఆయన అన్నారు. అధికారిగా సంస్థకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. పదవి విరమణ పొందిన అధికారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిఎం కార్యాలయం అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడిలు, కార్యాలయ సిబ్బంది తో పాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.