calender_icon.png 28 February, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ విరమణ కార్మికులకు సన్మానం

28-02-2025 06:17:45 PM

మంచిర్యాల (విజయక్రాంతి): శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్ లోని ఆర్కే న్యూ టెక్, ఆర్ కే 6 గనుల్లో ఉద్యోగ విరమణ పొందిన సింగరేణి ఉద్యోగులకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల దంపతులను పూలమాలలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ, కార్యదర్శి అంబాల శ్రీనివాస్ బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, ఫిట్ సెక్రటరీ పేరుక సదానందం, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ సందీప్, ప్రతాప్, జనార్ధన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.