21-04-2025 11:02:15 PM
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుని ఘనంగా సన్మానించారు. పొన్నారంలోని పాఠశాల ఆభరణాలు ఆభరణాలు ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్థులు స్కూల్ అసిస్టెంట్ నరేందర్ రావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాజి ఉప సర్పంచ్ వాల రవీందర్ రావ్ మాట్లాడారు. ఉపాధ్యా యులుగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎలాంటి మచ్చ లేకుండా ఎన్నో ప్రశంసలు పొంది అనేక మంది విద్యార్థుల ను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని ఆయన సేవలను కొనియాడారు. ఉపాద్యాయుని శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ సంకే శ్రీనివాస్, మాజి ఉప సర్పంచ్ పెంచాల మధు, మాజి వార్డ్ సభ్యులు గడ్డం శ్రీనివాస్, గ్రామస్థులు దుర్గం మధు, వేల్పుల రాజారాం, ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య లు పాల్గొన్నారు.