calender_icon.png 4 December, 2024 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది రోజుల్లో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ జీవో

05-11-2024 01:58:24 AM

మంత్రి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అంశంపై రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, పది రోజుల్లో దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

సర్కార్ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, అంగన్‌వాడీ టీచర్ల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నదన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఆలస్యమవుతున్నాయన్నారు.

ఈ అంశంపై ఇప్పటికే తాను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్కతో చర్చించానన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు త్వరలో భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే ప్రతి కేంద్రానికి ఉచితంగా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రి అనంతరం అంగన్‌వాడీ టీచర్ చీరె డిజైన్లపై అంగన్‌వాడీ సిబ్బంది నుంచి సలహాలు, సూచనలు కోరారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ క్రాంతి వెస్లీ పాల్గొన్నారు.