బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపు ఆలోచన సరైంది కాదని బీసీటీఏ టీచర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయ స్సును 61 నుంచి 58 ఏండ్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వయస్సు పెంపు నిర్ణయం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసేలా ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఉద్యోగం పొంది తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని నిరుద్యోగులు కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారని, తాము చదివిన చదువుకు సంబంధం లేకుండా ప్రైవేట్ సం స్థల్లో చాలీచాలని జీతాలతో బతు కు నెట్టుకొస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు కూడా సన్నగిల్లాయని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయ స్సు పెంచడమనేది నిరుద్యోగులకు నష్టం చేకూర్చుతుందని ఆయన తెలిపారు.