calender_icon.png 30 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్‌మెంట్ వయస్సు పరిమితి పెంచం

29-01-2025 12:38:43 AM

  1. ఉద్యోగాలపై 7న కీలక ప్రకటన
  2. రెండేళ్లలో అందుబాటులోకి ‘ఫ్యూచర్ సిటీ’ 
  3. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ ఐటీ విస్తరణకు ప్రణాళికలు
  4. మీడియాతో మంత్రి శ్రీధర్‌బాబు చిట్‌చాట్

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సు పరిమితి పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తేల్చిచెప్పారు. ఉద్యోగాల విషయంలో వచ్చే నెల 7న కీలక ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. సచివాలయంలోని చాంబర్‌లో మంగళవారం ఆయన మీడి యాతో చిట్‌చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మంత్రి ఆసక్తికర సమాధానాలిచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రాష్ట్రంలో పెట్టుబడులు, ఐటీ విస్తరణ, దావోస్ అనుభవాలు, ఏపీ సీఎం చం ద్రబాబుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో తెచ్చిన పెట్టుబ డులను తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే తెచ్చిందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఐదేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ప్రణా ళికలపై తమ ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించిందని వెల్లడించారు. భవిష్యత్తు అంతా ఏఐ, సైబర్ సెక్యూరిటీదేనని అభిప్రాయపడ్డారు. అందుకే తాము ఆయా రంగాల్లో పెట్టుబ డులు ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ ఐటీని విస్తరించేందుకు  ప్రణాళి కలు రచిస్తున్నామని వివరిం చారు. దావోస్‌లో పెట్టుబడులు అమాంతం పెరగడానికి ‘గ్రీన్ ఎనర్జీ’ పాలసీనే కారణమని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలు డేటా సెంటర్లు ఏర్పాట చేసేందుకు ప్రభుత్వం భూసేకరణ చేపడుతున్నదని వెల్లడించారు.

మంత్రి అనంతరం అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌పైనా జోకులు పేల్చా రు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కంటే ట్రంప్ పెద్ద మాయగాడని అభివర్ణించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ తనకు ఏం కావాలో అదే మాట్లాడారని, కానీ.. ట్రంప్ అలా కాదని, ఎవరికీ అందని, ఊహించని రీతిలో ప్రచారం చేశారని కొనియాడారు.

చంద్రబాబు హైదరాబాద్ జోలికి రారు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్య లు చేశారు. ‘చంద్రబాబు హైదరాబాద్ జోలికి రారు’ అని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు పెద్దరికంగా, పరిపక్వంగా ఉంటాయని, ఆయ న హైదరాబాద్ మరింత అభివృద్ధి కోరుకుంటున్నారని వెల్లడించారు.

దావోస్‌లో ప్రస్తుతం  7 నుంచి  11 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తెలంగాణ రైజింగ్ బృంద సభ్యులంతా స్వెట్టర్లు వేసుకుని తిరుగుతుంటే, చంద్రబాబు మాత్రం ఖద్దరు దుస్తులే ధరించి సదస్సులకు హాజరుక కావడం తమను ఆశ్చర్యపరిచిందన్నారు. ఏపీకి  గ్లోబల్ కేపబులిటీ ఉందని, చంద్రబాబుకు దానిపై విశాలమైన దృక్పథం ఉందని కొనియాడారు.