రిటైర్డ్ పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలీసు రాజులు
సిద్దిపేట,(విజయక్రాంతి): తామంతా సంఘటితంగా ఏర్పడి సమస్యలు పరిష్కరించుకోవడానికి సంఘంగా ఏర్పాటు అయ్యామని రిటైర్డ్ పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు గుర్రప్పగారి రాజులు అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిద్దిపేట జిల్లాకు చెందిన రాజులు ఎన్నిక కావడం అభినందించే దగ్గ విషయం అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు. రిటైర్డ్ అయిన తమకు అనేక సమస్యలు ఉన్నాయని వాటి సాధన కోసం సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు. సిద్దిపేటలో రిటైర్డ్ ఆఫీసర్స్ యూనియన్ గతంలోని ఏర్పాటు చేశామని యూనియన్ కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వం సిద్దిపేటలో స్థలం కూడా కేటాయించిందని గుర్తు చేశారు. కొద్దిరోజుల్లో యూనియన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని కార్యచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో రిటైర్డ్ పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వీరారెడ్డి, ఉపాధ్యక్షులు ఎండి నసీరుద్దీన్, ఎస్. ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీలు గౌస్ పాషా, రామారావు, కోశాధికారి కె. విశ్వనాథం, సభ్యులు వెంకట రెడ్డి, చంద్రయ్య, ఇంద్రసేనా రెడ్డి, పద్మయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.