నిందితుల అరెస్ట్
ఆందోల్, జూలై 10: విశ్రాంత ఐపీఎస్ అధికారి భూమిని కాజేసేందుకు పత్రాలను ఫోర్జరీ చేసి, భూమిని విక్రయించేందుక యత్నించిన వారిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆందోల్‌కు చెందిన విశ్రాంతం ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, అతని సోదరులకు ఏటిగడ్డ గ్రామ శివారులో 57 ఎకరాల భూమి ఉంది. భూమికి సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేసి, ఆ భూమిని ర్యాకల్‌కు చెందిన సంజీవరెడ్డి, కంగ్టి మండలానికి చెందిన రాథోడ్, సుధాకర్, రవీందర్ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ యాదగిరిరెడ్డికి రూ.22.23 కోట్లకు విక్రయించారు. బిల్డర్ నుంచి టోకెన్‌గా రూ.11 లక్షలు ర్యాకల్‌కు చెందిన సంజీవరెడ్డి తీసుకున్నారు. బాధితుడు ప్రభాకర్‌రెడ్డి ఇటీవల సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాల మేరకు జోగిపేట పోలీసులు సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్‌పై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.