calender_icon.png 1 October, 2024 | 5:14 AM

విశ్రాంత ఐఏఎస్ చందనాఖాన్ కన్నుమూత

01-10-2024 02:28:52 AM

ఉమ్మడి ఏపీ టూరిజం సెక్రటరీగా విశేష సేవలు

ఐటీ, పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు సంతాపం

హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): విశ్రాంత ఐఏఎస్ అధికారి చందనా ఖాన్ సోమవారం కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్యంతో ఆమె చనిపోయినట్టు తెలిసింది. 1954లో మధ్యతరగతి కు టుంబంలో జన్మించిన చందనాఖాన్ కుటు ంబ సభ్యుల ప్రోత్సాహంతో ఐఏఎస్ సాధించారు.

1979 బ్యాచ్‌కి చెందిన చం దనాఖాన్ ఏపీ క్యాడర్‌ను ఎంచుకున్నారు. సుధీర్ఘకాలం పాటు ఉమ్మడి ఏపీకి సేవలందించారు. టూరిజం సెక్రటరీగా ఆమె చెరగ ని ముద్రవేశారు. ప్రసాద్ ఐమాక్స్, జలవిహా ర్, సెంట్రల్ మాల్, తారామతి బరాదరి, స్నో వరల్డ్ సహా హైదరాబాద్‌కు పలు ఐకానిక్ ఆ కర్షణలను తీసుకురావడంలో ఆమె కీలకపా త్ర పోషించారు.

కళల పట్ల ఆమెకున్న మక్కువే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పెగాసస్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించడానికి దారితీసింది. చందనాఖాన్ ఐఏఎస్ కాక ముందు కొంతకాలం లెక్చరర్‌గా పనిచేశారు.  చందనాఖాన్ మరణ వార్త తెలిసిన మంత్రి శ్రీధర్‌బాబు ఆమె నివాసానికి చేరుకొని, పార్థ్థివ దేహానికి నివాళులర్పించారు. 

పర్యాటక శాఖ కోసం అవిశ్రాంత కృషి  

చందనా ఖాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమె అంకితభావం కలిగిన వ్యక్తి. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఆమెతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. పర్యాటక శాఖ కోసం ఆమె అవిశ్రాంతంగా చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఆమె చేసిన రచనలు వృత్తిపరమైనవి మాత్రమే కాకుండా చాలా వ్యక్తిగతమైనవి. పర్యాటక రంగాన్ని ఉద్ధరించడంలో ఆమె కృషి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. మరణవార్త తెలిసి వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేయడానికి ప్రశాసన్ నగర్‌లోని ఆమె నివాసానికి వచ్చాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నాను.

 శ్రీధర్ బాబు, 

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి