calender_icon.png 16 November, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో రిటైర్డ్ ఇంజినీర్ డిజిటల్ అరెస్టు

16-11-2024 01:23:20 AM

  1. రూ.10 కోట్ల మేర స్కామ్‌కు పాల్పడిన సైబర్ నేరగాళ్లు
  2. రూ.60లక్షలను రికవరీ చేసిన పోలీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశ రాజధాని ఢిల్లీలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను 8 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేసి తెలివిగా అతడి ఖాతా నుంచి రూ.10 కోట్ల వరకు నగదు బదిలీ చేయించుకున్నారు. నిషేధిత డ్రగ్స్‌ను ఇతర దేశాలకు తరలిస్తున్నావంటూ బాధితుడిని బెదిరించి మోసానికి పాల్పడ్డారు.

ఢిల్లీలోని రోహిణిలో నివాసం ఉంటున్న 72 ఏళ్ల వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు సెప్టెంబర్ 29న ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను పార్సిల్ కంపెనీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తైవా న్ నుంచి సిషేధిత మందులు మీ పేరు మీద పార్సిల్  వెళ్తున్నాయని.. ఈ విషయమై ముంబై క్రైం బ్రాంచ్ అధికారులు మీతో మాట్లాడాలనుకుంటున్నారని తెలిపాడు.

దీని తర్వాత దుండగులు క్రైం బ్రాంచ్ ఆఫీసర్లుగా నటిస్తూ.. స్కైప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వీడియో కాల్‌లోకి రావాలని వృద్ధుడిని కోరారు. వారు చెప్పినట్లు చేసిన వృద్ధుడిని వీడియోకాల్‌లో బెదిరించిన దుండగులు అతడి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టారు. 

పిల్లలనూ ఇరికిస్తామని..

ఆ తర్వాత కొడుకు, కూతురిని ఇరికిస్తామ ని చెప్పి రూ.10.30 కోట్లను వృద్దుడి ఖాతానుంచి తమకు సంబంధించిన వివిధ ఖాతా ల్లో జమ చేయించుకున్నారు. దాదాపు 8 గంటలపాటు వృద్ధుడిని ఒకే గదిలో ఉంచిన సైబర్ నేరగాళ్లు నగదు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత వీడియోకాల్‌ను డిస్‌కనెక్ట్ చేశారు.

అనంతరం గది బయటకు వచ్చిన వృద్ధుడు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్టోబర్ 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సైబర్ క్రైం పోలీసులు సైబర్ నేరగాళ్లు దొంగిలించిన నిధుల్లో రూ.60 లక్షలను వెంటనే ఫ్రీజ్ చేయించారు.

డిజిటల్ అరెస్టులు అనేవి ఉం డవని.. అపరిచితులు తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకొని చేసే వీడియో కాల్స్‌కి భయపడవద్దని, బ్యాంక్ ఖాతా, ఆధా ర్, ఓటీపీ లాంటివి ఎవరితోనూ షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.