calender_icon.png 28 October, 2024 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ చెప్పడంతోనే బ్యారేజీల్లో నీళ్లు నింపాం: నల్లా వెంకటేశ్వర్లు

28-10-2024 03:38:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సోమవారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిర్వహించింది. కాళేశ్వరం డీపీఆర్ ను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించినట్లు తెలిపిన వెంకటేశ్వర్లు డీపీఆర్ కు సంబంధించిన దస్త్రాలను కమిషన్ కు అందజేశారు. కాళేశ్వరం డిజైన్లను కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. మినిట్స్ దస్త్రాలను పీసీ ఘోష్ కు అందించిన నల్లా వెంకటేశ్వర్లు మూడు బ్యార్యేజీలకు సంబంధించిన వివరాలను కమిషన్ ముందు ఉంచారు. 

మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపమే కారణమా..?, మూడు బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారు..? అని కమిషన్ వెంకటేశ్వర్లను ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వాధినేత కేసీఆర్ చెప్పాడంతోనే మూడు బ్యారేజీల్లో నీరు నింపామని, టెయిల్ వాటర్ లేకపోవడం, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ దెబ్బతిందని వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చాడు. ఇదిలా ఉండగా రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ నివేదిక కాళేశ్వరం కమిషన్ కు చేరనుంది. నిపుణుల కమిటీ కళేశ్వరం కమిషన్ కు నివేదిక ఇచ్చింది. నివేదికలను పరిశీలించిన తర్వాత ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ లను కమిషన్ ప్రశ్నించనుంది.