01-04-2025 07:54:54 PM
భద్రాచలం (విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ ఆరో తేదీన భద్రాచలం వచ్చే భక్తులకు విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పులిహార మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు సంఘం సభ్యులు మంగళవారం సమావేశమై భద్రాచలం ఆర్డీవో విజ్ఞప్తి మేరకు ఈ నెల 6వ తారీఖున జరగబోవు శ్రీ సీతా రామ చంద్రుల కల్యాణం కోసం భద్రాద్రి కి వచ్చే రామ భక్తులకు ఉడుత భక్తి గా పులిహార, పానకం, మజ్జిగ లను విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయ వద్ద ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కావున సంఘ సభ్యులు అందరూ ఆ రోజు జరిగే కార్యక్రమానికి హాజరై భక్తులకు ప్రసాదాలు అందించి వారి ఆకలిని కొంతైనా తీర్చాలని మేము చేసే ఈ ప్రయత్నానికి సహకరించ వలసిందిగా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూషణ్ రావు కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ గోళ్ల భూపతి రావు, వెంకన్న, హనుమంత్ రావు, సత్యనారాయణ, రామచందర్ రావు, శ్రీమతి మణికుమారి తదితరుల పాల్గొన్నారు.