calender_icon.png 25 November, 2024 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి కేసులో రిటైర్డ్ ఒద్యోగికి జైలు

28-09-2024 12:59:06 AM

కరీంనగర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అవినీతి కూసులో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా మోకరాల శ్రీధర్(54) గతంలో పనిచేశాడు. కోలాం ఆశ్ర మ ఉన్నత పాఠశాలను 2009లో శ్రీధర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూల్ హెచ్‌ఎంగా కట్ట నరసింహారెడ్డి పనిచేస్తున్నారు. సరై న రికార్డులు చూపలేదని నరసింహారెడ్డిని సస్పెండ్ చేశాడు.

తదుపరి నర్సింహారెడ్డి అభ్యర్థన మేరకు సస్పెనన్ ఎత్తివేశారు. సస్పెండ్ అయిన ఏడు రోజుల కాలాన్ని ఈఎల్‌గా పరిగణలోకి తీసుకుంటున్న ట్టు తెలిపారు. సంబంధించి ప్రొసీడింగ్స్ కోసం నరసింహారెడ్డి శ్రీధర్ ను కలిసి దరఖాస్తు చేశారు. దానికి రూ.మూడు వేలు డిమాండ్ చేయ గా నర్సింహారెడ్డి ఏసీబీ అధికారులకు సంప్రదించారు. ఏసీబీ అధికా రులు పథకం ప్రకారం 2009 ఏప్రి ల్ 24న లంచం తీసుకుంటుండగా ఉట్నూరులోని తన నివాసంలో శ్రీధర్‌ను పట్టుకున్నారు. కేసును విచారించిన న్యాయాధికారి శుక్రవారం తీర్పునిచ్చారు.