04-12-2024 12:55:38 AM
వరంగల్‌లో వెలుగు చూసిన ఘటన
జనగామ, డిసెంబర్ 3(విజయక్రాంతి): ఓ విశ్రాంత రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపేశారు. మంగళవారం తెల్లవారుజామున వరంగల్ రంగంపేటలోని ఆగి ఉన్న కారులో స్థానికులు ఆయ న మృతదేహాన్ని గుర్తించారు. ఏసీపీ నందిరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగట్టి రాజమోహన్ గతంలో కాకతీయ గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా సేవలు అందించి రిటైర్ అయ్యారు.
కుటుంబంతో కలిసి హ నుమకొండ శ్రీనగర్‌కాలనీలో నివా సం ఉంటున్నారు. పాత కక్షలో.. లేదా మరేదైనా కారణమో తెలియ దు గాను సోమవారం రాత్రి దుండగులు ఆయన్ను కత్తులతో దాడి చేసి హతమార్చారు. మర్నాడు ఉదయం రంగంపేటలో ఆగి ఉన్న కారులో రాజమోహన్ మృతదేహం కనిపించింది. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉండడం, ఒంటినిండా గాయాలు ఉండడాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. విచారణ అనంతరం హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు.