calender_icon.png 11 February, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా 3

11-02-2025 01:06:10 AM

రెండెకరాల వరకు రైతులకు 1091.95 కోట్లు జమ

ఇప్పటివరకు 34.69 లక్షల మందికి.. 36.97లక్షల ఎకరాలకు..

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : 2024-25 వ్యవసాయ సీజన్ లో యాసంగికి సంబంధించి రాష్ట్రవ్యా ప్తంగా రైతులకు పంటసాయంగా అందిం చే రైతు భరోసా కార్యక్రమం వేగంగా సాగుతోంది. సోమవారం రెండు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు సంబంధించి రూ. 1091.95 కోట్లను ప్రభుత్వం విడుదల చేసి 13.23 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది.

దీనితో సోమవారం రాత్రి 8. గంటల వర కు రాష్ట్రవ్యాప్తంగా 34.69 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఆర్థిక సాయం అందించినట్టయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి వచ్చిన సిఫారసులను క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కేవలం పంటలను సాగు చేస్తున్న భూములకే ఎలాంటి పరిమితి లేకుండా రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

అందుకు అనుగుణంగానే రైతు భరోసా ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా జనవరి 27 రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిచేసి.. మొత్తం 577 గ్రామాల్లోని 4.41 లక్షల మందికిపైగా రైతులకు చెందిన 9.48 లక్ష ల ఎకరాల సాగుభూములకు (పరిమితం అనేది లేకుండా) ఒకేరోజు సుమారు రూ. 569 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది.

ఆపై ఫిబ్రవరి 5 తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు సాగవుతున్న 17.03 లక్షల రైతులకు సంబంధించిన 9.29 లక్షల ఎకరాలకుపైగా భూములకు రూ. 557.54 కోట్లను ప్రభుత్వం ఆయా ఖాతాల్లో జమ చేసింది. తిరిగి సోమవారం (ఫిబ్రవరి 10 తారీఖు) రోజు రెండు ఎకరాల వరకు సాగుచేస్తున్న 13,23,615 మంది రైతులకు సంబంధించిన 18,19,919.09 ఎకరాలకు రైతు భరోసా ఆర్థిక సాయం రూ. 1,901.95 కోట్లకుపైగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది.

దీనితో మొత్తం ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ. 2,218.49 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమచేసింది. గడిచి మూడు విడతలుగా జమ చేసిన రైతు భరోసా ఆర్థిక సాయం వివరాలు ఇలా ఉన్నాయి..

తేది రైతుల సంఖ్య ఎకరాలు రైతు భరోసా మొత్తం (రూపాయల్లో) ఎంత విస్తీర్ణం వరకు

27.01.2025 441911 948332.35 5689997265 577 పైలట్ గ్రామాల్లో

05.02.2025 1703419 929234.20 5575407019 ఒక ఎకరం వరకు

10.02.2025 1323615 1819919.09 10919515390 రెండు ఎకరాల వరకు

మొత్తం 3468945 3697486.24 22184919674

ఆలస్యంగా రుణమాఫీ రెతులపె వడ్డీ భారం: మంత్రి తుమ్మల

పదేండ్లు అధికారంలో ఉండి ఎప్పుడూ రైతుల మధ్యకు రాని నేతలు.. ఇప్పుడు అధికారం పోయేసరికి బయటకు వచ్చి రైతాంగ సమస్యలపై మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బీఆర్‌ఎస్ నేతలను విమర్శించారు. ఈ సంవత్సరం కాలంలో రైతు ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ. 55256 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి వివరించారు.

రైతు భరోసా కింద రెండెకరాల వరకు సాగుభూమి ఉన్న 8.66 లక్ష ల మంది రైతులకు సంబంధించి 11.79 లక్షల ఎకరాలకుపైగా రైతు భరోసా కింద అందించాల్సిన రూ. 707.54 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిన సందర్భంగా మంత్రి సోమవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా రైతులకు నేరుగా ఖాతాలోల జమ చేసింది రూ. 40 వేల కోట్లని మంత్రి తెలిపారు.

పావలా రుణమాఫీ అని ప్రతిసారీ విమర్శించే నాయకులు 2018లో రుణమాఫీ ఏ సంవత్సరం మొదలుపెట్టి ఏ సంవత్సరం వరకు.. ఎంత మందికి ఇచ్చారో చెప్పి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒక విశ్వసనీయత ఉండేదని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 2018లో చేయాల్సిన రుణమాఫీని ఎలక్షన్లలో లబ్ధికోసం 2023లో అదికూడా సగం మందికి విడుదల చేసిన మీరా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేందంటూ బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

2014లో రుణమాఫీకి సంబంధించి 4 సంవత్సరాల పాటు చారానా చొప్పున రుణమాఫీ చేయడంతో రైతులపై రూ. 2630 కోట్ల వడ్డీభారం పడింది నిజమా కాదా అని మీ దీక్షలలో రైతులను అడిగి తెలుసుకోవాలంటూ చురకలంటించారు. అలాగే 2018 రుణమాఫీ విషయంలో 4 సంవత్సరాలు ఆగి ఆఖరి సంవత్స రంలో చేయడం వల్ల రైతులపై రూ. 8315 కోట్ల వడ్డీ భారం వేసింది మీరా..

కాదా అని అడిగితే సరైన సమాధానాలు వస్తాయని మంత్రి తు మ్మల విమర్శించారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో రైతు బంధు, రైతు రుణమాఫీకి మీరు చేసిన ఖర్చెంత? కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే ఖర్చు పెట్టింది ఎంతో బేరీజు వేసుకుంటే మీరు రైతుల మధ్యకు వచ్చి మాట్లాడగలరా అంటూ మంత్రి ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో విపత్తులు సంభ వించి పంటలు పూర్తిగా నష్టపోయిన సందర్భంలో రైతులు ఆదుకునే ప్రయత్నం ఏనాడైనా చేశారా అంటూ తుమ్మల ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన బీఆర్‌ఎస్ నాయకులు.. బోనస్ గురించి మాట్లాడటం చూస్తుంటే.. ఏటి ఇసుక ఎంచలేం, తాటిమాను తన్నలేం, బీఆర్‌ఎస్ నాయకుల బుద్ధి మార్చలేం అన్నట్టుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.