calender_icon.png 27 November, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ కాంట్రాక్టులపై పునరాలోచన

27-11-2024 02:10:15 AM

ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి

అమరావతి, నవంబర్ 26: అదానీ గ్రూప్‌తో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందంపై ప్రస్తుత ప్రభుత్వం పునరాలోచిస్తున్నది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి పలు రాష్ట్రాల నుంచి కాంట్రాక్టులు పొందేందుకు ఆ కంపెనీ రూ.2,029 కోట్లు లంచం ఇచ్చిందని న్యూయార్క్ కోర్టు అభియోగాలు మోపింది. 

ఆగస్టు 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీ చేసుకున్న ఒప్పందమూ తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై మంగళవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. సదరు ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఒప్పందాల రద్దు అంశం పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు.