28-03-2025 12:00:00 AM
సూర్యాపేట, మార్చి 27: ఏఐటీయూసీ అనుబంధ సంస్థ హెచ్పీసీఎల్ లో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తగవని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవన్ లో ఏఐటియుసి ప్రాంతీయ గౌరవ సలహాదారులు చామల అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆ సంస్థ లో పని చేస్తున్న కార్మికులు, డ్రైవర్లు పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా తమ వేతనాలు పెంచాలని కోరుతూ చేసిన సమ్మె కారణంగా వారిని విధుల్లోంచి తీసివేయడం సరికాద న్నారు. తక్షణమే తొలగించిన వారిని విధు ల్లోకి తీసుకోవాలని, లేదంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.