న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 9 నెలల గరిష్ఠ స్థాయి అయిన 5.5 శాతానికి చేరుకుంది. ఆగస్టు నెలలో రి టైల్ ద్రవ్యోల్బణం కేవలం 3.7 శాతం మాత్రమే ఉండింది. కేంద్రప్రభుత్వం సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
దీంతో సమీప భవిష్య తుత్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు మృగ్యమయ్యాయి.కాగా సెప్టెంబర్ నెలలో భారీగాపెరిగిన ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో కూడా 5 శాతానికి పైగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కూరగాయల సూచీ 36 శాతం, ఆహార పదార్థాల కేటగిరీలోకి వచ్చే ఇతర వస్తువులు అంటే టమోటాలు, ఉల్లిపాయలు, వంటనూనెలు వంటివి ఇప్పటికే అక్టోబర్ మొదటి వారంలో పెరగడం అవదరికీ తెలిసిందే. అయితే పుష్కలంగా వర్షాలు కురిసిన కారణంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగే ప్రమాదం తగ్గినప్పటికీ కూరగాయల ధరల్లో మాత్రం భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.