calender_icon.png 6 November, 2024 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పుంజుకున్నకమల

06-11-2024 12:19:29 AM

  1. చివరి నిమిషంలో ట్రంప్‌పై ముందంజ
  2. ఫైనల్ సర్వేల్లో వెల్లడి

వాషింగ్టన్, నవంబర్ 5: ఎన్నికల నేపథ్యంలో కమల హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఫైనల్ సర్వేకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాయి. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న కొన్ని చోట్ల కమల పుంజుకున్నట్లు ‘ఫైవ్ థర్టీ ఎయిట్’ తన సర్వేలో తెలిపింది.

స్వింగ్ రాష్ట్రాల్లో మాత్రం పోటీ ఎక్కువగా ఉందని, ఫలితాలను కచ్చింతగా అంచనా వేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. కమల గెలిచేందుకు 50.015 శాతం అవకాశాలు ఉండగా, ట్రంప్‌నకు 49.985 శాతం ఛాన్స్ ఉన్నట్టు చెప్పింది. ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా స్పలంగా ఉన్నందున చివరి ఫలితాల్లో ఏమైనా జరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది.

అలాగే దిహారిస్ ఎక్స్-ఫోర్బ్స్ నిర్వహించిన సర్వేలో కమలకు 49శాతం మంది మద్దతు తెలుపగా ట్రంప్‌నకు 48శాతం మంది సపోర్ట్ చేసినట్లు వెల్లడైంది. పీబీఎస్ న్యూస్-ఎన్‌పీఆర్-మార్టిస్ సర్వేలో కమల ముందంజలో ఉన్నారు. 51శాతం మంది కమల వైపు మొగ్గు చూపగా..

47శాతం మంది మద్దతుతో ట్రంప్ వెనుకంజలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్, ఎకానమిస్- యూగవ్ సర్వేల్లో హ్యారిస్‌కు 3శాతం ఆధిక్యం లభించింది. అబార్షన్ చట్టాల అంశం కమలకు, ఆర్థికవ్యవస్థ, ధరల అంశాలు ట్రంప్‌నకు అనుకూలంగా మారాయని తేల్చిచెప్పింది.