మహబూబాబాద్,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వేట్రాక్ భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులను పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. అప్ లైన్ మార్గంలో రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా... డౌన్ లైన్ లో అర్థరాత్రి కల్లా పనులు పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వరదల వల్ల మహబూబాబాద్ జిల్లా ధ్వంసమైన రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులను దాదాపు 52 గంటల్లో పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన రైలు సర్వీసులు మళ్లీ ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.