calender_icon.png 17 October, 2024 | 5:54 AM

చాట్‌జీపీటీతో రెజ్యూమ్

17-10-2024 01:05:55 AM

వైరల్ అవుతున్న సీఈఓ పోస్టు

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఉద్యోగ దరఖాస్తు కోసం చాట్‌జీపీటీని ఉపయోగించి రూపొందించిన రెజ్యూమ్(సీవీ)ని చూసి ఓ సంస్థ సీఈఓ ఖంగుతిన్నారు. ఇటీవల ఎంట్రేజ్ సంస్థ సీఈఓ అనన్య నారంగ్‌కు  ఓ ఉద్యో గం కోసం దరఖాస్తు వచ్చింది. అది చూసిన ఆమె షాక్‌కు గురయ్యారు. సాధారణంగా చాట్‌జీపీటీని ఫలానా ఉద్యోగం కోసం రె జ్యూమ్ రూపొందించు అని చెప్పగానే.. అది వెంటనే తయారు చేసి ఇస్తుంది.

అయితే అందులో కొన్ని విషయాలు మనమే పూరించాల్సి ఉంటుంది. అయితే సీఈఓ అనన్యకు సదరు అభ్యర్థి.. చాట్‌జీపీటీ రూపొందించిన రెజ్యూమ్‌ను ఎలాంటి ఎడిట్ చేయకుండా అలాగే పంపించాడు. అందులో నైపుణ్యాలు, అనుభవం వద్ద ఉదాహరణ అని ఉండటాన్ని చూసి సీఈఓ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ తీసి ఆమె ‘ఎక్స్‌లో పోస్టు చేయగా ’ ఇప్పుడది వైరల్‌గా మారింది.