calender_icon.png 4 April, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం

04-04-2025 12:17:31 AM

  1. 10,954 మంది జీపీవోల నియామకంతో రెవెన్యూసేవలు చేరువ అవుతాయి
  2. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంను నెరవేర్చే బాధ్యత జీపీవోలదే
  3. సీఎం, రెవెన్యూ శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
  4. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

మహాబూబ్‌నగర్ ఏప్రిల్ 3(విజయ క్రాం తి): ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖ లోకి వస్తున్న జీపీవో (గ్రామ పరిపాలన అధికారి)లు సర్వీసుపరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు.

గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది. సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీవోలందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చిట్లుగానే ప్రతి జీపీవో కు పదోన్నతులు ఉంటాయన్నారు.

ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చెరువ కావడంతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తున్నాయన్నారు. దీంతో క్రమంగా రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేం దుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు.

భూ భారతి చట్టంతో రెవె న్యూ శాఖ బలోపేతం కావడంతో పాటు రైతులకు గ్రామ స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం ఆవుతాయన్నారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంక ల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియామకం చేస్తుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆకాంక్షకు ప్రభుత్వ సహకారం తోడవ డంతో రెవెన్యూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాదించుకున్నామన్నారు. 

ప్ర భుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాదించామన్నారు. అలాగే గతంలో ధరణిలో తహశీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టంలో తహశీల్దార్లకు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికా రాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. 

భూ భారతి చట్టం ద్వారా రాష్ట్ర రాజధానిలోని సీసీఎల్‌ఏ నుండి గ్రామ పరిపాలన అధికారి వరకు అధికారాల వికేంద్రీకరణ జరగడంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయన్నారు.  ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంతో మళ్లీ గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థ క్రమంగా బలోపేతం అవుతుందని లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

తక్కువ సమయంలోనే ఎక్కువ మేలు..

దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించడంతో పాటు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల సంఖ్యను పెంచడం, గ్రామ స్థాయి లో రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రామానికో అధికారి చొప్పున 10,954 జీపీవో పోస్టుల ఏర్పాటు మనకు అతిపెద్ద విజయాలుగా లచ్చిరెడ్డి అభివర్ణించారు. అలాగే జీఓ నం.317 రాష్ట్రంలో ఉద్యో గులను చిన్నాభిన్నం చేసిందన్నారు.

ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలకు సైతం చెట్టుకొ క్కరికి పుట్టకొక్కరికి పోస్టింగ్ లు ఇచ్చారన్నారు. జేఏసీ ఉద్యమ ఫలితంగా ఉద్యోగుల ఆంక్షలను, 317 జీవోలోని నిబంధనలను ప్రభుత్వం సడలించిందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలను యూని ట్గా తీసుకొని మనందరం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవడం జరుగుతుం దన్నారు.

సమీప భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించుకుంటామని జేఏసీ చైర్మ న్ వి.లచ్చిరెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణ, కోశాధికారి వెంకట్ రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం,టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు పి. రాధ, సీ సీఎల్‌ఏ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ చైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేశం, టీజీఆర్‌ఎస్‌ఏ మహిళా విభాగం అధ్యక్షులు సుజాత చౌహాన్, టీజీటీఏ ఉపాధ్యక్షులు పాల్ సింగ్, పూర్వపు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్ రావు, మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, నారాయణ పేట్ అడిషనల్ కలెక్టర్ బెంజ్ శాలం, ఆర్డీవో ఈ. నవీన్, డిప్యూటీ కలెక్టర్ అరుణా రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.