calender_icon.png 18 November, 2024 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీసాలపై ఆంక్షలు విధిస్తే మేలే

12-11-2024 12:01:42 AM

  1. ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద దేశీయంగా తయారీ బలోపేతానికి అవకాశం
  2. ట్రంప్ కొత్త పాలనపై ఎస్‌బీఐ తాజా నివేదిక

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వస్తే డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసీలపై పరిమితులు విధించవచ్చన్న వార్తలు గత కొంతకాలంగా వినిపి స్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పడు ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించారు కూడా. అయితే భారతీయులకు ఎంతో అచ్చుమెచ్చిన పథకం అయిన హెచ్1బీ వీసాలపై ఆయన పరిమితులు విధించడం  మోదీ చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’కార్యక్రమానికి ఊతమవుతుందని, ఉత్పాదకత, స్వయం సమృద్ధితో పాటుగా మన దేశంలోకి వచ్చే పెట్టుబడులు సైతం పెరుగుతాయని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండి యా తన తాజా నివేదికలో అభిప్రాయపడింది.

వీసాలపై  ముఖ్యంగా హెచ్1 బీ వీసాలపై ట్రంప్ ఆంక్షలు విధించే అవకాశాలను లోతుగా చర్చించిన ఈ నివేదిక దీనివల్ల ఓ వైపు అమెరికలోని భారతీయ ఐటీ, ఐటీ అనుబంధ రంగ సంస్థల ఖర్చు లు పెరుగుతాయని, అయితే మరో వైపు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశీయంగా తన తయారీని బలోపేతం చేసుకోవడానికి అవకాశం లభిస్తుందని అభిప్రాయపడింది. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు అమెరికా జారీ చేసిన నాన్ ఇమిగ్రెంట్ వీసాల సంఖ్య ఏడాది 10 లక్షలుగా నిలకడగా ఉన్నాయి. అయితే 2023లో భారతీయులు అందుకున్న వీసాల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది 10.4 లక్షల వీసాలు ఇచ్చింది.

10% దాకా తగ్గనున్న రూపాయి

మరో వైపు ట్రంప్  రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో  డాలరుతో రూపాయి విలువ 810 శాతం పడిపోవచ్చని, అంటే డాలరుకు 87నుంచి 92 రూపాయలకు చేరుకోవచ్చని కూడా ఎస్‌బీఐ తన తాజా నివేదికలో అంచనా వేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటుగా భారత ఆర్థిక వ్యవస్థపైనా ట్రంప్ ప్రభావం ఉండవచ్చని, అందువల్ల డాలరుతో రూపాయి విలువ మరింత తగ్గే అవకాశం ఉందని  ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సైతం డాలరుతో రూపాయి విలువ దాదాపు 11 శాతం తగ్గింది. అయితే భారీగా పడివచ్చన్న భయాలు అర్థం లేనివని, తగ్గుదల తర్వాత అది పుంజుకునే అవకాశాలు కూడా  ఆ నివేదిక స్పష్టం చేసింది.