calender_icon.png 7 April, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోలీ సందర్భంగా ఆంక్షలు: పోలీస్ కమిషనర్

14-03-2025 12:00:00 AM

ఖమ్మం, మార్చి 13 ( విజయక్రాంతి ): హోలీ పండుగ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలులో వుంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ వేడులను ప్రశాంత వాతావరణంలో   జరుపుకోవాలని..రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన, వాహనాలపై గుంపులు.. గుంపులుగా తిరుగుతూ..పరిచయం లేని వ్యక్తులపై రంగులు జల్లడం, వాహనలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లిన, గొడవలు సృష్టించిన కఠిన చర్యలు తప్పవని అన్నారు. 

మద్యం దుకాణాలు, బార్లు బంద్

మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.