- ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఆర్టీసీలో యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని, ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
సోమవారం టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, అందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని, గత ప్రభుత్వ విధానాలనే అమలు చేయాలనే సంకేతాలను పంపడం సరైంది కాదని హితవు పలికారు. సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, పీ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.