calender_icon.png 27 December, 2024 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టపాసుల మోతపై ఆంక్షలు

31-10-2024 12:41:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): దీపావళి సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో టపాసుల మోతపై సీపీ అవినాష్ మహంతి ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని బహిరంగ ప్రదేశాలు, ప్రజలు ఎక్కువ గుమిగూడే ప్రాంతాల్లో టపాసులు పేల్చ డం పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడిం చారు. ఈ ఉత్తర్వులు 31వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.