calender_icon.png 9 October, 2024 | 3:00 PM

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

04-09-2024 01:14:41 AM

ముందస్తు చర్యలతో 3వేల మందిని రక్షించాం 

రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలు 

పంట, ఆస్తి నష్టం వివరాలు తెప్పించుకోవాలె

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలె

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

జిల్లా కలెక్టర్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ 

హైదరాబాద్,సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కష్టకాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ  ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికా రులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి మంగళ వారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విపత్తుల నిర్వహణ విభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని, పూర్తి వివరాలను జిల్లాల నుంచి తెప్పించుకోవాలని సూచించారు.  

133 పునరావాస  కేంద్రాలు..

రాష్ట్రంలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 117 గ్రామాల్లో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఇందులో ఒక  ఖమ్మం జిల్లాలోనే 49 వేల మంది ఉన్నారని మంత్రి పొంగులేటి  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,538 మం దిని తరలించామని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల 3,039 మందిని రక్షించుకోగలిగామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులను చేపట్టాలని మంత్రి ఆదేశిం చారు.

51 బ్రిడ్జిలు, 249 కల్వర్ట్స్, 166 ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని, 13,342 జీవాలు మృతి చెందాయన్నారు. వదర ప్రభావిత ప్రాంతాల్లో అహారం, తాగునీరుకు లోటు లేకుండా అందించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం తో అసలైన సవాళ్లు ఇప్పుడు ఎదురవుతాయని, మానవీయ కోణంలో సహాయ చర్యలు చేట్టాలన్నారు. ప్ర ధానంగా వృద్ధులు, గర్భిణీలు, పసిపిల్లలు, దివ్యాంగుల విషయంలో తగి న జాగ్రత్తలు తీసుకోవాలని  చించారు. మరికొన్ని రోజులు కూడా అ ప్రమత్తంగా ఉండాలని, నష్టపోయి న వారందరిని ఆదుకోవాలని, కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలన్నా రు. బురదగా మారిన ప్రాంతా ల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్య లు చేపట్టాలని మంత్రి సూచించారు.