15-04-2025 12:50:17 AM
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 14 (విజయ క్రాంతి) : భూభారతీ ఏర్పాటుతో గ్రామాల్లో రెవిన్యూ సేవల పునరుద్ధరణ జరుగుతున్నధని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం రైతు వేదికవద్ద భూభారతి పోర్టల్ ప్రారంభం కార్యక్రమాన్ని లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయం ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వంలో ధరణి వలన భూ వ్యవస్థ చిన్నా భిన్నమైందని దాన్ని ప్రక్షాళన పరిణామమే భూభారతి పోర్టల్ ఏర్పాటన్నారు. వ్యవస్థకు రూపకల్పన చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు రుణపడి ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పి శంభో శంకర్,ఏ ఏ ఓ లు వై.సత్యం ఎం.సుజాత, ఎన్ అనురిక, జి.నరేష్, సొసైటీ డైరెక్టర్ చౌగని పాపారావు, మం డల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, మాజీ జడ్పిటిసి మాలోతు నంద నాయక్, పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు కొండం పుల్లయ్య, గంధం నరసింహారావు, కందుకూరి రాము, ఉండేటి శాంతివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.