calender_icon.png 9 January, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్‌కు విశ్రాంతి!

03-01-2025 12:00:00 AM

  • బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు

నేటి నుంచి భారత్,  ఆసీస్ ఐదో టెస్టు

సిరీస్ సమంపై దృష్టి


సిడ్నీ: బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో భాగంగా నేటి నుంచి సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు మొదలుకానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2 ఆధిక్యంలో ఉంది. కాగా సిరీస్‌లో దారుణంగా విఫలమవుతోన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. రోహిత్ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

గురువారం ఉదయం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కోచ్ గంభీర్ ఒక్కడే రావడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. తుది జట్టులో రోహిత్ ఉంటాడా అన్న ప్రశ్నకు గంభీర్ పిచ్ పరిస్థితి బట్టి తుది జట్టును ఎంపిక చేయనున్నాం అని తెలిపాడు. దీన్నిబట్టి రోహిత్‌కు ఇదే చివరి టెస్టు సిరీస్ కానుంది. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై మాత్రం వేటు ఖాయంగా కనిపిస్తోంది. అతడి స్థానంలో ధ్రువ్ జురేల్‌కు ఆడే చాన్స్ ఉంది. రోహిత్ స్థానంలో గిల్ మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మరోవైపు ఆసీస్ మాత్రం ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 3 సిరీస్ గెలుచుకోవాలని భావిస్తోంది. మ్యాచ్ ఉదయం 5 గంటలకు మొదలుకానుంది.