12-03-2025 12:37:57 AM
జిల్లాలోని కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 11 (విజయ క్రాంతి) : జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పి రోహిత్ రాజ్ కోర్టు డ్యూటీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని కోర్టు డ్యూటీ ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారు లతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. పలు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులు వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేసులు పెండింగ్ ఉండడా నికి గల కారణాలను తెలుసుకు న్నారు.
ఎప్పటికప్పుడు కేసుల పురోగతి వివరాలను ఉన్నతాధికారులకు తెలియ జేస్తూ కేసుల లోని ప్రతి విషయాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయా లన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఎస్త్స్రలు హారిక,హసీనా మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు